ఇంద్ర ధనుస్సు లాంటి జీవితపు వర్ణాల్ని కాన్వాస్ పైన సృష్టిస్తారు ఆర్టిస్ట్ అంజనీ రెడ్డి. జె.ఎన్. టి .యూ లో లెక్చరర్ గా పనిచేసిన అంజనీ రెడ్డి ప్రవృత్తి మాత్రం బొమ్మలు వేయటం చుట్టూ ఉన్న జన జీవితాన్ని బొమ్మల్లో గీస్తారామె. ప్రత్యేకంగా మహిళల జీవనశైలి వాళ్ళ బాలలు బలహీనతలు సంక్లిష్టమైన పరిస్థితులు ఉద్వేగాలు ఆమె కళకు కధ వస్తువులు. ఆక్రిలిన్ వాటర్ కలర్స్ తో బొమ్మలు వేస్తారు. దేశవ్యాప్తంగా 13 ఎక్సిబిషన్స్ నిర్వహించారు. యుకె హాంగ్ కాంగ్ ,సింగపూర్ ,బ్యాంకాక్ , జకార్తా ,స్వీడన్ లలో ఆమె పెయింటింగ్స్ ప్రదర్శనకు వెళ్లాయి. ఇప్పుడామె పెళ్లిళ్లు పండగల్లో జరుపుకునే ఆచారాలపై ఆర్ట్ సిరీస్ వేస్తున్నారామె. మన జీవితం లోకూడా ఇన్ని రంగులున్నాయా అనిపిస్తుంది. ఆమె పాంటింగ్స్ చూస్తుంటే. మీరూ ఆర్టిస్ట్ అంజనీ రెడ్డి పెయింటింగ్స్ చూడచ్చు.
Categories