![విశ్వ సుందరిగా ఎంపికైన వేదిక నుంచి ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం అపురూపమైన విషయమో. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994లో ఫిలిప్ఫిన్స్ లోని మనీలాలో జరిగిన అందాల పోటీలో విశ్వ సుందరిగా ఎంపికయ్యారు. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వేదికపైన జనవరి 30వ తేదీన జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీలకు జడ్జిలలో ఒకరిగా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి చెపుతూఇది అపురూపమైన విషయం మాత్రమే కాదు పరిపూర్ణం కూడా. నా లైఫ్ ఇప్పుడు ఫుల్ సర్కిల్ తిరిగినట్లుగా ఉంది అంటోంది సుస్మితా సేన్. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కూతురు అలీషా సేన్ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు సుస్మితా. ఈ తల్లీకూతుళ్ళిద్దరితో పాటు మిస్ యూనివర్స్ కిరీటం కోసం మన దేశం నుంచి పోటీపడుతున్న రోష్మితా హరిమూర్తి భారతీయతకు నిండుదనం తేబోతున్నారు. ఆ రోజు రోష్మితకు టైటిల్ వస్తే మళ్ళీ అదో గొప్ప రికార్డు.](https://vanithavani.com/wp-content/uploads/2017/01/susmitha-sen.jpg)
నా జీవితం కల్లోల సమయంలో నేనో నిర్ణయం తీసుకొన్నాను ఎంతో అనారోగ్యంతో స్టెరాయిడ్స్ తప్పని సరిగా తీసుకోవలసిన సమయంలో దానికి ఎదురు నిలిచి యోగా,జిమ్నాస్టిక్ ను మొదలు పెట్టాను. నన్ను కుంగ దీసిన నా ఆ నారోగ్యం నా దేహాలంలో అడ్రినల్ గ్రంథి కార్టిసోల్ ను ఉత్పత్తి చేయకపోవటం, మనిషి ఆరోగ్యానికి కీలకమైన ఈ కార్గిసోల్ హార్మోన్ ఉత్పాత్తి లేకపోవటంతో డాక్టర్స్ స్టెరాయిడ్స్ తప్పవన్నారు. కానీ యోగా నాకు పూర్తి ఆరోగ్యం ఇచ్చింది అంటటోంది విశ్వసుందరి సుస్మితా సేన్ . ఈ అనారోగ్యం కోసం ఆమె .జర్మనీ కూడా వెళ్ళింది. డాక్టర్స్ స్టెరాయిడ్స్ కొనసాగించాలనే అన్నారు. కానీ ప్రాచీన యోగా ఆమె అనారోగ్యాన్ని తిరిగి ఇచ్చింది. అందరికీ ఇదే వర్తిస్తుందని అనుకోకూడదు. సుస్మిత మందులు మానేసి ప్రాణాలు పణంగా పెట్టి గెలచింది..