ఆరోగ్యంగా, తీరైన శరీర సౌష్టవంతో వుండాలంటే జిమ్ కు వెళ్లితీరాలా లేక తినే ఆహారం సాధ్యమైనంత తక్కువ తీసుకొంటే సరిపోతుందా అనే డైలమా చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు ఇంట్లో అస్తమానం బొంగరంలా తిరుగుతాం కదా ఇంకా జిమ్ ఎందుకు? అంటారు. సరే అటునుంచి రావాలంటే కొద్దిపాటి వాకింగ్ తో పాటు కొద్దిపాటి ఆహార ఎంపికలు ఫలితాలు శీఘ్రం గా చూపించి ఉత్సాహం తెస్తాయి. తక్షణ శక్తి కోసం సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలు పది నిముషాలు వాకింగ్ చాలు. మంచి మూడ్ కోసం మెదడుకు మంచి పోషకాలు కావాలి. 20 నిముషాలు వ్యాయామం మెదడును ఉత్సాహంతో నింపుతుంది. వీక్ మజిల్ ఉన్నవారు కండరాలు పటిష్ట పరిచే ఆహారపదార్ధాలు తీసుకోవాలి. సలాడ్ల పైన ఆలివ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ఆరోగ్యవంతమైన ఫ్యాట్ కండరాల వేస్టేజీని అరికడతాయి. కార్బోహైడ్రేట్స్ నాడీ వ్యవస్థను ఉద్దీప్తం చేసి మానసిక శక్తిని పెంచుతాయి. లంచ్ లో బీన్స్ వంటివి మూడ్ ను, మెమొరీని పెంచుతాయి. కేవలం గృహిణులు ఎన్నో గంటలు నాలుగ్గోడల మధ్యనే పని చేస్తుంటారు కనుక వారికి మనసు, శరీరం చైతన్యంగా ఉంది, తీసుకున్న ఆహారం సరిపోయి చేసే కాస్త వ్యాయామం సరిపోతుందని ఎక్స్పర్ట్స్ చెపుతున్న విషయాలు. ఎటుతిప్పినా సవ్యంగా కాస్తయినా శరీరం కదిలించాలి.

Leave a comment