పిల్లలు వాళ్లకు కావలిసిన సరంజామా లగేజీ ఎక్కడికి పోయినా అందరి చాకిరీ తల్చుకుని ఆడవాళ్లు వెనకాడేవాళ్లేమో గానీ ఏ చిన్న అవకాశం వచ్చినా ఎవ్వళ్ళనీ పట్టించుకోకుండా మగవాళ్ళు దూరప్రయాణాలకు సిద్ధం అయిపోయేవాళ్లు కానీ ఇప్పుడొచ్చిన రిపోర్ట్ ఒకమారిపోయిన కాలాన్ని కళ్లముందుంచుతుంది. ఒక సర్వే లో 75 శాతం మహిళలు ట్రావెల్ ప్లాన్స్ లో ముందున్నారట. 63 శాతం మంది స్త్రీల ట్రావెలింగ్ తమని విజ్ఞానవంతుల్ని చేస్తారన్నారు. 36 శాతం మంది ట్రావెల్ తమ ఆలోచనా తీరుపై జీవనశైలి పై ప్రభావం చూపెడుతుందంటున్నారు. 57 శాతము మంది కొత్త విషయాలు నేర్చుకుంటామని రిలాక్స్ అవుతామంటున్నారు. 35 శాతం మంది తమ జీవిత భాగస్వాములతో ట్రావెల్ చేద్దామనుకుంటే 16 శాతం మంది కుటుంబ ప్రయాణాలు ఇష్టమంటున్నారు. మొత్తానికి స్త్రీలు హ్యాపీగా యాత్రలకు సిద్దపడుతున్నారని తేలుతోంది. ఆ నాలుగ్గొడలే ప్రపంచంగా ఇల్లే వైకుంఠం అనే భావన పోవటం మాత్రం స్త్రీలందరినీ అభినందించాల్సినవిషయం. నాలుగుళ్లు తిరిగితే లోకజ్ఞానం పెరుగుతుంది. ఆడది తిరిగి చెడింది మగాడు తిరగక చెడ్డాడు అనే సామెత ను సృష్టించిన వాడెవడో ఈ సర్వే చదివితే తప్పక చచ్చుంటాడు.
Categories