Categories
పిల్లలు అదేపనిగా చిరుతిండ్లు తింటూ ఉంటే అది వారి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపెడుతుందనే ఉద్దేశ్యంలో భారత ప్రభుత్వం గతంలోనే స్కూలు ఆవరణ ,పరిసరాలను ఆరోగ్యకర జోన్ లుగా మార్చాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ అఫ్ ఇండియాను కోరింది . పాఠశాలల ఆవరణలో ,చుట్టుప్రక్కల చిరుతిండ్లును నిషేధించేందుకు గాను మార్గదర్శకాలను రూపొందించాలని పేర్కొన్నది . ఇప్పటికి ఎఫ్ ,ఎస్ ఎస్,ఎ,ఐ కేవలం పోషకాహారం సురక్షితమైన పదార్దాలు మాత్రమే స్కూల్స్ లో పిల్లలకు లభ్యమైయ్యే విధంగా మార్గదర్శకాలు రూపొందించింది . స్కూల్ కి 50 మీటర్ల పరిధిలో పాస్ట్ ఫుడ్ వాణిజ్య ప్రకటనలు నిషేదానికి సంబంధించి ప్రతిపాదించింది . ఈ ప్రతిపాదన ఢిల్లీలో అన్ని స్కూల్స్ కి వర్తిస్తుంది . ఈ ప్రతిపాదన దేశమంతా విస్తరిస్తే పిల్లలంతా ఆరోగ్యంగా ఉంటారని చెప్పటంలో సందేహం లేదు .