ఒక డ్రెస్ పైన ఎంబ్రాయిడరీ చేయాలంటే డిజైన్ ఎంచుకుని కుట్టించటం చాలా శ్రమ. ఎంబ్రాయిడరీ ఆప్లిక్ ఫ్యాన్ లు వచ్చాయి ఇప్పుడు. రకరకాల డిజైన్స్ లో ఎంబ్రాయిదారీ చేసిన ఫ్యాన్ లు ఇవి. చిన్ని చిన్ని పువ్వులు, పొడవాటి డిజైన్ లు వస్తున్నాయి. ఈ ఎంబ్రాయిడరీ ఫ్యాన్ కొనుక్కుని వర్క్ కావాలనుకున్న దుస్తులపైన పెట్టి కుట్టిన్చేస్తే సరిపోతుంది. లేహంగాలు, అనార్కలీలు, చుడీదార్లు, టాప్స్ పైకి లార్జ్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ లు వున్నాయి. చక్కని డిజైన్ లు రంగులు చూసి ఆర్డర్ ఇచ్చుకోవాలి. కొన్ని ఫ్యాన్ల అడుగుభాగంలో జిగురు వుంటుంది. వీటి నైతే దుస్తుల పైన పెట్టి ఇస్తీ చేస్తే వేడికి జిగురు కరిగి దుస్తులకు అంటుకుంటుంది. వీటిలో పెద్ద పెద్ద పువ్వుల గుర్తులు, నెమల్లు, ఆకులూ తీగలు, వీటి పై చమ్కీలు, కుందన్ లు పూసలతో ఎంతో చక్కగా వున్నాయి.

Leave a comment