Categories
WoW

కాబోయే తల్లుల కోసం యాప్.

పాపాయి ఎలా పెరుగుతుందో తెలుసుకోవాలని కాబోయే ప్రతి తల్లి కొత్రుకుంటుంది. అదే మొదటి సారిగా గర్భం ధరిస్తే ఇంకా ఎన్నెన్నో సందేహాలు, భయాలు. ప్రతి సారి డాక్టర్ తో చర్చించాలి అంటే కుదరదు. అలాంటప్పుడు ఎదురయ్యే ప్రై ప్రశ్నకీ సమాధానం చెప్పుతుంది డీవయా ప్రెగ్నెన్సీ ట్రాకర్ అండ్ బేబీ కౌంట్ డౌన్ క్యాలెండర్ యాప్. గర్భాధరణకు సంబంధించి 1500 పైగా వ్యాసాలు సూచనలు ఈ యాప్ లో ఉంటాయి. పాపాయి ఎదుగుదలకు సంబందించి, బిడ్డ ఏ దశలో వుందో బొమ్మల్ని ఇందులో చూడవచ్చు. వైద్యుల దగ్గరకు ఇప్పుడు వెళ్ళాలి? ఇలాంటివి తినాలి?  ఎలాంటి లక్షణాలు తేలిగ్గా తీసుకోవాలి? ఏవేం జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వాన్ని సూచనలు ఇస్తుందీ యాప్. చేయవలసిన వ్యాయామాల వివరాలు ఉంటాయి. ఈ యాప్ లో గర్భాదారణకి సంబందించిన సమస్త విషయాలు ఇందులో చూడచ్చు.

Leave a comment