నీహారికా ,

గంటసేపు ఏం  మాట్లాడవు ఫ్రెండ్ తో అంటే ఎదో ఫార్మాలిటీ అన్నావు. కానీ నీహారికా కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్. మాట్లాడే కళను అభ్యాసం చేయాలి. మాట్లాడటం కంటే మాటలు వినటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి సంభాషణల మాధుర్యం ఓర్పు గల చెవిలో దాక్కుని ఉంటుందిట. మనం గ్రూపుగా ఉంటే ఒకళ్ళ తోనే  కబుర్లు మొదలుపెట్టకూడదు. మన వంతు వచ్చే వరకు వేచి చూడాలి. మాటకు ముందు ఆలోచన ఉండాలి. నాకే బాగా తెలుసన్న దృక్పధం కబుర్లలో దొర్ల కూడదు. ముఖ్యంగా మాట్లాడుతూ సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నావా ఇక సంభాషణలు వద్దనుకొంటున్నావని మెసేజ్ ఇచ్చినట్లు. ఎదుటివాళ్ళ మౌనాన్ని అర్ధం చేసుకోవాలి. సంభాషణలో నైపుణ్యాన్ని అలవర్చుకోవటం లాంటిదే ఇది కూడా . ఇతరులతో మాట్లాడటం ద్వారా మనం అర్ధం చేసుకునే విషయాలు కాలక్రమేణా మన ఆలోచనలు భావాలకు ఓ కొత్త రూపం ఇస్తాయి. అన్నాడో ప్రొఫెసర్. అంటే ఇతరులతో మనం మాట్లాడే మాటలు మనల్ని మనం తెలుసుకోవటానికి ఉపయోగపడతాయన్నమాట. సంభాషణలంటే మనల్ని మనం టచ్ లో ఉంచుకోవటం . మన ఇంప్రూవ్మెంట్ మనకే తెలుస్తుంది. మాటలంటే బంగారం కంటే విలువైనవి అపురూపమైనవి నిహారికా!!

Leave a comment