నాకోసం కొత్త పాత్ర సృష్టించండి అనే సాహసం చేయను . ఎందుకంటే ప్రయోగాలు ప్రతిసారీ సక్సెస్ కాకపోవచ్చు. నాలో వీటిని సంతృప్తి పరిచేందుకు సినిమాలతో ప్రయోగాలు చేయను అంటోంది రకుల్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ నుంచి ఆమె కెరీర్ ఎక్స్ ప్రెస్ లాగే దూసుకుపోతోంది. ధ్రువ దాకా అన్నీ సక్సెస్ లే. మహేష్ బాబు రామ్ చరణ్ వంటి స్టార్స్ తో నటిస్తోంది. ఇటు యువతరం కధా  నాయకుల లోనూ సినిమాలు చేస్తోంది. కెరీర్ కొత్తల్లో నాకు వచ్చిన పాత్రలు చేసేదాన్ని . అప్పుడు ఎంపిక అన్న క్వశ్చన్ లేదు. ఇప్పుడు రొటీన్ పాత్రలు వస్తున్నాయి. ఇప్పుడు నా ఆప్షన్ ఏవీ లేదు. ఉన్నంతలో ఎదో ఒక కొత్త దానం చూపించేలా ఆలోచిస్తానంటే అంటోంది. రకుల్. సినిమాల్లో సాహసాల మాటెలావున్నా వ్యాపారంలో మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయలేదు  రకుల్. జిమ్ బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతూ ఇంకో రెండు మూడు సెంటర్ లు పెట్టేవరకు విస్తరిస్తోంది.

Leave a comment