Categories
గర్భంతో ఉన్నప్పుడు ఏదైన తినవచ్చు. పత్యాలు ఏవి వద్దు. ఆరోగ్యంగా ఉండమని చెబుతున్నారు డాక్టర్లు. ఇప్పుడు కొత్త పరిశోధనలో కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పంచదార, స్వీట్స్ తగ్గించమని చెబుతున్నారు. తీపి ఎక్కువగా తీసుకుంటే పుట్టబోయే బిడ్డలకు ఏడో సంవత్సరం వచ్చేసరికి రకరకాల అలర్జీలు, అస్థమా వంటివి చుట్టుముట్టాయని ఒక రిసెర్చ్ లో గమనించామని చెబుతున్నారు. కొన్ని వందల మంది పిల్లలతో పదేళ్ళపాటు జరిపిన ఒక రిసెర్చ్ లో పిల్లలకి శ్వాసనాళ ఇబ్బందులు, ఊపిరి తిత్తుల ఇబ్బందులు కేవలం చెక్కర ఎక్కువ తినే గర్భిణిలు తీపి ఇష్టపడే వాళ్ళ పిల్లల్లో గమనించారట. అసలు తీపి రుచి మాత్రమే కాని ఆరోగ్యం ఎంతమాత్రం కాదంటున్నారు.