చూసేందుకు చిన్న హార్మోనియం లాగా లేదా చిన్న కీ బోర్డు లాగా కనిపించే ఆఫ్రికన్ కలింబా వాయిద్యం సంగీత ప్రియులను పరవశులను చేస్తోంది. చెక్క తో తయారైన కలింబా పెట్టె పైన ఏడెనిమిది మెట్లు నుంచి 17 వరకు ఉంటాయి. యూట్యూబ్ లో ఎట్లా వాయించాలో చూస్తూ దీన్ని సాధన చేయచ్చు. దీనితోపాటు యూజర్ ఇ బుక్ కూడా ఇస్తున్నారు. పియానో మాదిరిగా ఉండే కలింబా ను చాలా తేలికగా నేర్చుకోవచ్చు. ఆసిమి సౌండ్ థంబ్ పియానో మ్యూసూ కలింబా, కిమి అక్రిలిక్ కలింబా పేరుతో ఈ పరికరం ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు. ఐదు వందల నుంచి వివిధ ధరల్లో దొరుకుతుంది కలింబా.

Leave a comment