అందం కోసం ఇంట్లో అలంకరించుకునే గాజు బొమ్మల్లాగే ఆహారం అందంగా కనిపించడం కోసం ప్రత్యేక బొమ్మలోస్తున్నాయి. షుగర్ షో పీసెస్. అచ్చంగా అందమైన కళాకృతులు ల్లాంటి పంచదార బొమ్మలు చూస్తుంటే అందమైన గాజు బొమ్మని టాబుల్ పైన పెట్టి నట్లు కనిపిస్తాయి. పంచదార నీరు పోసి బాగా వేడి చేసి సిలికాన్ రబ్బర్ మ్యాట్ పైన పోసి కావాలనుకున్న రంగు కలిపి గాజు వంటి పదార్ధం తాయారు అవుతుంది. దీన్ని వుల్డ్ షుగర్ అంటారు. బొమ్మలు చేసే క్లే లాంటిది ఇప్పుడు ఇది కాస్త వేడిగా ఉండగానే దేనితో నెమళ్ళు, పక్షులు, పువ్వులు, జలపాతాలు అందమైన ప్రక్రుతి మొత్తం ఈ సాగరాన్నే ఈ ముద్ద లో నుంచి రూపం పోసుకుంటాయి. ఈ బొమ్మలు చూసేందుకు కొన్ని అచ్చుల సాయం లేదా గాలి వూరే పరికరం ద్వారా బోలుగా ఉచ్చేట్టు చేస్తూ ఈ చూడ చెక్కని బొమ్మలు చేస్తారు. ఎండ తడి తగలక పొతే ఈ పంచదార బొమ్మలు ఏడాది దాకా చెక్కగా ఉంటాయి. ఈ షుగర్ శ్వ పిసెస్ కోసం ఇమేజస్ ఎన్నో వున్నాయి. చూస్తేనే కళ్ళు చేడురుతాయి.
Categories