Categories
పుట్టుకతోనే గొంతుదాకా మునిగిపోయిన ఊబి లాంటిది దామిని సేన్ జీవితం. పుట్టుక తోనే రెండు చేతులు లేవు. చత్తీస్ ఘడ్ లోని రాయపూర్ కు చెందిన దామిని సేన్ ను అందరూ వింతగా చూస్తే వాళ్ళ అమ్మానాన్న మేమే ఆమె రెండు చేతులూ అన్నారు. ఆమెను గురుకుల పాఠశాలలో చేర్చారు. పదవ తరగతిలో దామిని సేన్ 80 శాతం మార్కులు సాధించింది. చక్కగా బొమ్మలేస్తుంది. కాలి వేళ్ళతో ఒక గంటలో 38 బొమ్మలు గీసి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. కాలి గోటితోనే ఎన్నెన్నో రికార్డులు సాధించింది. ఇంటి పనుల్లో తల్లికి సాయం చేస్తుంది. అన్ని అవయవాలు చక్కగా ఉన్నా చివరికి బాగా చదివేందుకు కూడా బద్దకించే ఎంతో మంది అమ్మాయిలు 12వ తరగతి చదువుతున్న దామిని సేన్ ను స్పూర్తిగా తీసుకోవాలి.