Categories
నిద్రలో ఒక్కసారి కాలి వేళ్ళు తిమ్మిర్లు ,కాలి కండరాలు పట్టేసి నొప్పి పెడతాయి. ఇందుకు కారణం పొటాషియం లోపం కావచ్చు . కండరాలను అలసట చెందనివ్వకూడదు. కాళ్ళ పాదాలు పడుకొనే ముందర మసాజ్ చేసుకోవాలి. పట్టేసిన కండరాలపైన వేడి నీళ్ళతో కాపడం పెట్టాలి. ముఖ్యంగా ఆహారంలో అరటి పండు, బంగాళాదుంపలు ,సిట్రస్ పండ్లు ,పాలకూర ,బీన్స్ సమృద్ధిగా తినాలి. వీటిలో పొటాషియం ఉంటుంది. ఆహారం ద్వారా పోషకాలు అందితేనే ఆరోగ్యం.