Categories
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయల్ సమీపంలో కన్యగా కన్యకాపరమేశ్వరి వెలసింది.
పురాణాల ప్రకారం పార్వతీ దేవి వివాహం కొరకు ఎదురుచూస్తూ ఇక్కడ విగ్రహ రూపంలో ఉండిపోయిందిట.పరశురాముడు ప్రతిష్ఠ చేశారు అని అంటారు.పార్వతీ దేవి అతి బలవంతుడైన బాణాసురుని హతమార్చడానికి ఇక్కడ ఉందిట.అట్టి సమయానికి పెళ్లి ముహూర్తం దాటిపోయినందుకు శివుడు యోగ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు.అందుకే పార్వతీ దేవి వివాహం చేసుకోకుండా కన్యగా ఉండిపోయింది కావున కన్యకాపరమేశ్వరి గా పేరు వచ్చింది.
నిత్య ప్రసాదం:కొబ్బరి,పొంగలి,పులిహోర
-తోలేటి వెంకట శిరీష