Categories
కాలుష్యానికి భయపడి టూ వీలర్ పై వెలుతున్న చాలమంది శరీరం పూర్తిగా కప్పుతూ ఉంటారు. ఇలా చేయటం అన్ని సార్లు సమర్ధనీయం కాదంటారు నిపుణులు. దీని వల్లనే విటమిన్ డి అందకుండ పోవడమే కాక చర్మ మెరుపుపోతుందంటారు. అలాగే ఎముకల్లో దృడత్వం కూడా తగ్గుతుంది. రోజంతా ఏసీ గదుల్లో, కార్లలో తిరిగే వాళ్ళతో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. సహజమైన సూర్యకాంతి కాస్తయిన శరీరం మీద పడితేనే ఆరోగ్యం. వారంలో మూడుసార్లయిన కనీసం 15 నిమిషాలు సుర్యకాంతి శరీరానికి తగలాలి. డైట్ నుంచి అందే విటమిన్ డీ శాతం చాలా తక్కువ బల్కానీలో టెర్రస్ పైన కిటికీలో నుంచి ఎండపడే చోట ప్రతిరోజు కాసేపు గడపటం అలవాటు చేసుకుంటే మంచిది