ఫేస్ బుక్,వాట్సప్,స్నాప్ చాట్ ,ఇన్ స్టా గ్రామ్ లలో యువత నిరంతరం మునిగిపోయే ఉంటున్నారు. సోషల్ మీడియాను వాడే వారు డిప్రెషన్ తో వంటరి తనంతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెభుతున్నారు.అదే సమయంలో సోషల్ మీడియాలో పని లేని వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉద్యోగ వ్యాపకాల్లో మునిగి తేళేవాళ్ళకు ఎలాంటి సమస్యలు లేవు.సోషల్ మీడియాలో తమని అనుసరించేవాళ్ళు తమను ఫాలో అయ్యేవాళ్ళు ఒక్క పోస్ట్ కు రెస్పాండ్ అవ్వకపోయినా బాధపడే యువతే ఎక్కువగా ఉన్నారని ప్రతిక్షణం ఏదో కొత్త దనం చూపిస్తూ సెల్ఫీలు పోస్ట్ లతో గడిపే యువతలో ఆందోళన ఎక్కువగా కనపడుతుందని దాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఇతర వ్యాపకాలు కల్పించుకోమని చక్కని పుస్తకాలు చదవడం స్నేహితులతో కలిసి గడపడంతో మానసిక సమస్యలు రావని చెబుతున్నారు.

Leave a comment