బెంగాల్ అమ్మాయి స్వప్న బర్మన్ ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన సందర్భంగా టివిలో ఆ వార్త చూస్తూ ఆమె తల్లీ,తేయాకు తోటల్లో పని చేసే కార్మికురాలు బోరునా ఏడుస్తూ పరుగెత్తుకుపోయి దేవుడి మండపం ముందు బోర్లాపడుకున్నా దృశ్యం మాద్యమాల్లో అందరి కళ్ళను తడిపేసింది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్ గురి ప్రాంతంలో పేద గిరిజన కుటుంబంలో పుట్టిన స్వప్న ఇంటి నిండ కష్టాలతో నిండి ఉన్న పట్టుదల వదలకుండా స్వర్ణం సాధించింది.పట్టుదల మనుషుల్ని ఎంత ఎత్తుకైనా చేరుస్తుందని చెప్పేందుకు గొప్ప ఉదాహరణ స్వప్న బర్మన్.

Leave a comment