ఈ ప్రపంచలో 99 మంది దంపతులు తాము పెళ్ళాడి పిల్లల్ని కని తల్లిదండ్రులం అయిపోతాం అనుకుంటారు. కానీ ఒక జీవికి జన్మనివ్వడం అన్నది ఎంత ముఖ్యమైన విషయమో తెలుసుకోలేదు. ఒక బిడ్డనిచ్చే ముందుగా చెక్ చేసుకోవలసిన విషయాలున్నాయి. బిడ్డకు, ఆహారం, దుస్తులు, నివాసం దానం సమయం వంటి అత్యవసరమైన వనరులు అందించె స్ధితిలో వున్నామా? పిల్లల్ని శ్రద్ధ శక్తులతో పెంచగలిగే తీరిక, ఓపిక ఉన్నాయా? పిల్లలను శారీరక, మానసిక విద్యాపరమైన సామాజిక అవసరాలకు వున్న స్ధితికి ఎదగాలన్న కోరిక తో వారిని శ్రద్ధగా పెచగాలమా? కోరినవి ఇవ్వగలమా? ఇంటి వాతావరణం పిల్లలు పెరిగేందుకు అనుకూలంగా వుందా? భార్యా భర్తల మధ్య కావలసినంత సయోధ్య వుందా? ఇద్దరు కలిసి పిల్లలను పెంచేందుకు సిద్దంగా వున్నారా? ఈ ప్రశ్నలకు జవాబులు ‘సరే’ అని వస్తే అప్పుడు వాళ్ళు బిడ్డల్ని కానీ తల్లి దండ్రులుగా మారచ్చు.
Categories