శ్రావణమాసంలో పండగ వాతావరణంలో సంప్రదాయకంగా కనిపించేందుకు ఉత్సాహ పడే అమ్మాయిలు ముఖాలంకరణ లో కాటుక కు చోటివ్వమంటున్నారు ఎక్స్ పార్ట్స్ . కాటుక చక్కని కళ ఇస్తుంది. ముందుగా రోజ్ వాటర్ తో మొహం కడుక్కోవాలి. ఆ పైన మాయిశ్చురైజర్ ని వ్యతిరేక దిశలో రాసుకోవాలి. ఇలా చేస్తే ఎక్కువ సమయం మొహం తాజాగా వుంటుంది. పండగ వేళ వీలైనంత తక్కువ మేకప్ తో కొద్దిగా కాటుక, లైనర్, మస్కారా, లిప్స్టిక్ లతో వుంటే వేసుకున్న సాంప్రదాయికమైన దుస్తులు, నగలు అన్నీ కలుపుకుని అసలైన పండగ కళ తో వుంటారు. వీటన్నిటికంటే చక్కని కాటుక  కళ్ళే నిజానికి పండగ కళ అంతా తెచ్చేస్తాయి. అలాగే రాత్రి వేళ, ఈ కాటుక ను తొలగించాలంటే కాటన్ బడ్ పై కొద్దిగా క్లెన్సర్ వేసి దానితో కంటి కార్నర్స్ తుడిస్తే కాటుక తొలగిపోతుంది.

Leave a comment