డిజైనర్ శారీస్ తయారు చేసే ఫ్యాషన్ డిజైనర్స్ అందుకు అనువుగా వుండే వస్త్రాల కోసం ఎంతో పరిశోధన చేస్తారు. అలా కనుగొన్న భాగల్ పురీ సిల్క్స్ దుస్తులు క్యాట్ వాక్ లో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. గంగా నడి తీరంలో వున్న చిన్న పట్టణం భాగల్ పూర్, భాగల్ పూరి లేదా టస్లార్ అనే ఎంతో ఖ్యాతి చెందిన నేత చీరలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అనేక వందల భగల్ పూరి చేనేత కార్మికులు అద్భుతాలు సృష్టిస్తూనే వున్నాయి. కొంతకాలంగా ఆదరణ కరువైన భగల్ పూరి కాటన్స్ పైన డిజైనింగ్ రంగంలో శిక్షణ పొందిన ఎక్స్ పర్ట్స్ దృష్టి పెట్టుకుని ఆ టస్సార్ వర్క్ ని నిలిపేందుకు ప్రయత్నం చేసారు. టస్సార్ నేత కార్మికులకు కొత్త డిజైన్ లు అందిస్తున్నారు. ఆ కళ గురించి దేశ విదేశాలకు పరిచయం చేసారు. ఆ టస్సార్ వస్త్రాలు ఇవ్వాళ ఫ్యాషన్ రంగంలో మంచి స్థానంలో వున్నాయి. ఫ్యాషన్ ఇండస్ట్రీయే ఒక రకంగా సాంప్రదాయ నేత కార్మికులను ఆడుకున్నదని చెప్పాలి.
Categories