Categories
Soyagam

పాదాల పగుళ్ళకు నువ్వుల నూనె.

అందంగా పొందికగా తయ్యారైన పాదాలు మాత్రం మురికిగా పగుళ్ళ తోటి వుంటే ముందు అందం సంగతి అలా వుంచి , ఆ పగుళ్ళు గీసుకుని కతుకున్న సున్నితమైన చీర పోగులు లేచి వస్తాయి కూడా. సీజన్ తో నిమిత్తం లేకుండా కొందరికి పాదాల పగుళ్ళు ఎప్పుడూ ఉంటాయి. దీనికి పరిష్కారం నువ్వుల నూనె తో మసాజ్ చేసుకోవడం. పడుకునే ముందర కాస్త నువ్వుల నూనె తీసుకుని పాదాలకు మసాజ్ చేయాలి. ఈ మసాజ్ కొబ్బరి నూనె మరకలు అవుతాయనుకుంటే లూజ్ గా వుండే సాక్స్ వేసుకోవచ్చు. ఉదయం లేస్తూనే స్క్రుబ్ చేసి శుబ్రంగా కాళ్ళు కడుక్కోవాలి. లేకుంటే నూనె రాసిన పాదాల పై మురికి దుమ్ము అతుక్కుపోతుంది. పండిపోయిన అరటి పండు మంచి ఉపసమనం తోలు నల్లగా అయిపోయిన అరటి పండు మెదిపి పదాలు పాటించి ఓ పావు గంటకి కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా కొన్ని రోజులు చేస్తే పాదాల పగుళ్ళు పోయిచర్మం మృదువుగా అయిపోతుంది.

Leave a comment