చీర కట్టులో వుండే అందం నాజూకుతనం ఇంకే డ్రెస్సుల్లోనూ వుండదు. ఫారినర్స్ సైతం మన చీర కట్టుకు వంద మార్కులు ఇచ్చేస్తారు. అయితే చీర కట్టే తీరులోనే వెరైటీ వుంటుంది. పమిటలు కుడిఎడమకు మార్చి కుచ్చిళ్ళు పోసి ఎన్నో రకాలు. ఇందులో మళయాళీల డ్రెస్ చాలా ప్రత్యేకం. ఇక్కడి చీరలను సెట్టుముండు లేదా ముండుమ్ నేరియా తుమ్ అంటారు. ఇది మామూలుగా టూపీస్ కాస్ట్యూమ్. కేరళీయుల ట్రెడిషనల్ కట్టుతీరు. నెరియత్తు అప్పర్ గార్మెంట్ ముండు లోయర్. అయితే చక్కని జరీ అంచులతో ముట్టుకుంటే మెత్తగా తగిలే ఈ అందమైన నేత చీర నూరు శాతం మగ్నం పైన నేసే ఈ చీర ఇప్పుడు ఆరు గజాల మామూలు చీరలు అన్ని ప్రాంతాల వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇక ఈ చీరపైన జరుగుతున్న ప్రయోగాలకు అంతులేదు. నెమలి వెన్నెల పింఛాలు దగ్గర నుంచి ప్రకృతి అందచందాల దాకా ఈ జరీ అంచునేత చీర పై చిత్ర కారులు లేసే అందమైన కళా ఖండాలై అన్ని ప్రాంతాల వారి మనసు దోచేస్తున్నాయి.
Categories