Categories
జానపద కళలు సంస్కృతి సాంప్రదాయం ఇష్టపడే వాళ్ళు కేరళ రాష్ట్రం లోని కొచ్చి లో గల కేరళ ఫోక్ లోర్ మ్యూజియం చూసి తీరాలి దీన్ని దివంగత జార్జ్ థాలియాత్ అతని భార్య అన్నీ జార్జ్ స్థాపించారు. 150 సంవత్సరాల నాటి వుడ్ కార్వింగ్ మెట్లు,పురాతన సీలింగ్ లు ప్రాచీన చర్చి లు, మసీదుల నుంచి సేకరించిన నగిషీల తలుపులు దేవతామూర్తుల విగ్రహాలు. కథాకలి థెయ్యం నాట్యాల్లో ఉపయోగించిన మాస్క్ లు షీల్డ్ లు కత్తులు సంగీత వాయిద్య పరికరాలు టెంపుల్ జ్యువెలరీ చక్రవర్తులు వాడిన తలపాగాలు కిరీటాలు మొదలైన వేలాది వస్తువులు ఇక్కడున్నాయి. 18వ శతాబ్ది నాటి 64 టన్నుల బరువైన ఉడెన్ సీలింగ్ ఇక్కడ ఒక ప్రత్యేకత. సీలింగ్ మధ్యలో సపోర్ట్ లేకుండా ఉండటమే స్పెషాల్టీ .