Categories
కేరళ స్పెషల్ ఓనం చీరె. గోధుమరంగు కోరా చీరెకు బంగారు రంగు బోర్డర్. ఈ చీరెకి ఉన్న స్పెషాలిటి 2011లో కేంద్రప్రభుత్వం ఈ చీరెలు నేసే కుథంపల్లి అనే ఊరికి కూథంపల్లి శారీ పేరుతో బౌగోళిక గుర్తింపునిచ్చింది. ఈ కుథంపల్లిలో సంవత్సరానికి 60 వేల చీరెలు నేస్తారు. చీరె ధర 1800 నుంచి 12 వేల రూపాయల వరకు ఉంటుంది.కర్ణాటకలోని చౌడేశ్వరీ వీళ్ళ దేవత. ఆ దేవతను కూథంపల్లిలో సౌడేశ్వరి అమ్మ అంటారు. ఇది కేరళ చీరె అంటారు కాని అది కర్ణాటక కు చెందిన చేనేతకారుల కళ. దీన్ని అక్కడ కసావు చీరె అంటారు.