మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన సృష్టి సుధీర్ జగ్తాప్ విరామం లేకుండా 127 గంటల పాటు నృత్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్  లో గిన్నిస్ సాధించింది. ఆమె తాతగారు స్వయంగా నాట్య గురువు గిన్నిస్ రికార్డు కోసం కథక్ నాట్యం నేర్చుకుంది. ధ్యానంతో యోగా నిద్ర కూడా సాధన చేసింది సృష్టి. 16 సంవత్సరాల సృష్టి వరుసగా ఐదు రోజుల పాటు ఇచ్చిన నాట్య ప్రదర్శన తో ఆమె తల్లిదండ్రులు తాత అండగా ఉన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి స్వప్నిల్ దంగారికర్ సర్టిఫికెట్ ప్రధానం చేసి సృష్టి కొనియాడారు.

Leave a comment