Categories
గ్లోబల్ హైజీన్ కౌన్సిల్ తాజా సర్వే లో, శుభ్రత అంటే టాయిలెట్స్ అటాచ్డ్ బత్రూమ్స్ లో కంటే కిచెన్ రూమ్ లోనే బాక్టీరియాల ప్రమాదం 20 శాతం ఎక్కువగా వుందని తేల్చింది. మాములుగా చేతులు కదగకుండా బాక్టీరియా పోదు భరించ లేనంత వేడి నిటితో కడగాలి. అది అసాధ్యం కనుక యాంటీ బాక్టీరియల్ లిక్విడ్ లో కడుక్కోమంటున్నారు చేతుల్న. గిన్నెలనన్నీ 65 డిగ్రీల వేడి నీళ్ళల్లో పడేసి శుభ్రం చేయాలి. కిచెన్లో వాడే టవల్స్ పై 75 శాతం బాక్టీరియా వుంటుంది. కిచెన్ క్లీనింగ్ టవల్స్ ఇల్లు తుడిచిన క్లాత్ లు మరిగే నీళ్ళల్లో ముంచాలని సర్వే సర్వే రిపోర్ట్లు హెచ్చరిస్తున్నాయి. యాంటీ బాక్టీరియల్ సర్ ఫేస్ వైప్స్ లో వంటింటి కప్ బోర్డ్స్ శుభ్రం చేస్తే 99.9 శాతం బాక్టీరియా నశిస్తోందిట.