Categories
పిల్లలు ఏం చెప్పబోయినా ఉండు నాకు అవతల పనుంది అని అంటుంటారు పెద్దవాళ్ళు.కానీ వాళ్ళు మనసులో ఏముందో వాళ్లు మీకు ఏం చెప్పాలనుకున్నారో కాస్త వినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అమ్మా నాన్నకు చెబితే కొట్టట మో, తిట్టటంమో చేస్తారని భయపడే పిల్లలకు ఏ విషయాన్నయినా ధైర్యంగా పంచుకునే స్వేచ్ఛ ఇమంటున్నారు. లేదంటే ఏదైనా సమస్య వస్తే వాళ్లు తమలో తాము కుంగిపోవడం మొదలుపెట్టి పెడతారు. పిల్లలు ఏమైనా సందిగ్ధంలో ఉంటే వాళ్లతో స్నేహితుల్లా మెలిగి సరైన సలహా ఇవ్వాలి లేకపోతే వాళ్ళ కొచ్చిన సమస్యకు ఏ స్నేహితులతోనూ పంచుకోని ,తప్పుడు సలహాలతో దారి తప్పే ప్రమాదం ఉందంటున్నారు. పిల్లలకోసం బ్రేక్ ఫాస్ట్ లోనో, భోజనం సమయంలోనూ కాసేపు మాట్లాడాలి. వాళ్ల మనసు తెలుసుకోవాలి. వాళ్ళకి పెద్ద వాళ్ళే నిజమైన స్నేహితులు బంధువులు అనిపించాలి.