నైట్ జాబ్స్ వచ్చాక పగటి నిద్ర అవసరమై ఆడపిల్లలు 30 ఏళ్ళుదాటేసరికే పొట్ట బరువు పెరుగుతున్నారు. ఇక బయటి భోజనాలు ఏటా తప్పవు గనుక సమస్య ఎదురుగ వచ్చి నిలబడుతోంది . ఫిట్ నెస్ సెంటర్ కు వెళ్లాలంటే ఎన్నో ప్యాకేజీలు. ఏది ఎంచుకోవాలి. అన్న సందేహం వచ్చినప్పుడు ముందర ఆ ప్యాకేజీ బరువు తగ్గటం అన్న ప్రధాన లక్ష్యంతో ఉండాలి. వెళ్లే ముందే ప్రాధమిక ఆరోగ్య అంచనాలు ముఖ్యం. కార్బోహైడ్రాట్స్ తగ్గించుకోవటం వేపుడు పదార్ధాలు మానేయటం వంటి ప్రాధమిక సూత్రాలకు కట్టుబడాలి. పండ్ల కూరగాయలు ఎక్కువగా తినాలి . ముఖ్యంగా ప్రోటీన్ పదార్ధాల పైన దృష్టి పెట్టాలి. ఉద్యోగం చేసే చోటికి దగ్గరగా వున్న జిమ్ ఎంచుకోవాలి. ఎదో ఒక సాకుతో ఎగ్గొట్టకుండా తప్పనిసరిగా రెగ్యులర్ గా వెళ్ళాలి. కార్డియో ఎక్సర్ సైజు లు కొవ్వు కరిగేందుకు ఎక్కువగా తోడ్పడతాయి. స్త్రెంగ్థ్స్ ట్రైనింగ్ కూడా అందులో భాగంగా ఉండాలి . ఫ్లెక్సిబిలిటీ సెషన్స్ ఉండాలి. ఆడ మగ అన్న తేడా లేకుండా మజిల్ స్త్రెంగ్థ్స్ పైకి దృష్టి వెళ్ళాలి. అస్తమానం కూర్చుని కూడా తొడలు కాళ్ళ బలం తగ్గిపోతుంది. యోగా క్లాసులు ఫ్లెక్సిబిలిటీ ని బ్యాలెన్స్ ను మెరుగు పరుస్తాయి.
Categories