Categories
వేడుకలకు ,పార్టీలకు కాస్త మేకప్ ఉంటేనే ముఖం ఎక్కువసేపు తాజాగా కనిపిస్తుంది . గులాబీ రంగు తో బుగ్గలు చక్కగా మెరిసిపోతూ ఉండాలంటే కొంచెం శ్రద్దగా మేకప్ చేసుకోవాలి . ముందుగా ఫౌండేషన్ రాసుకోవాలి . దీనితో స్కిన్ టోన్ ఒకే రంగులో చక్కగా కనిపిస్తుంది . బ్లష్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది . మెత్తని మేకప్ బ్రష్ తో గులాబీ రంగు మేకప్ పౌడర్ లేదా మేకప్ క్రీమ్ ను మూడు ఆకారంలో రెండుబుగ్గల పైన రుద్దాలి . అవసరం అనుకొంటే నుదుటి పైన కూడా అప్లై చేయచ్చు . చర్మతత్వానికి సరిపోయే బ్లష్ ఎంచుకొంటే బావుంటుంది క్రీమ్ బ్లష్ వాడితే ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది . పెయిర్ స్కిన్ ఉంటె గులాబీ రంగు ,లేకుంటే బెర్రీ కలర్ వాడితే అలంకరణలో కొత్త దనం కనిపిస్తుంది .