Categories
కిచెన్ గార్డెన్ లో కూడా కొత్తి మీర పెంచుకోవచ్చు. లేదా కాస్త వెలుతురు ఎండ పడే చోట ఒక ప్లాస్టిక్ ట్రే లో కూడా ధనియాలు చల్లాలి. మసాలా కు వాడే ధనియాల్లో పక్వానికి వచ్చే గింజలు చాలా తక్కువ.విత్తనాల ధనియాలు చల్లి తేనే మొలకలు వస్తాయి.ధనియాలను రెండు చేతులతో నలిస్తే రెండు పలుకుల విడిపోతాయి. వాటిని 24 గంటల పాటు నీళ్లలో నానబెట్టి అప్పుడు వాటిని మట్టిలో నాటుకోవాలి.కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉంటే రెండు వారాల్లో మొలకలు వస్తాయి.మిగిలిన ఆకుకూరల కంటే ఇవి ఆలస్యంగానే మొలకెత్తుతాయి. వేళ్ళతో సహా అలాగేయకుండా పైన ఆకుల వరకు కత్తిరిస్తే మళ్లీ చిగుళ్లు వేస్తాయి.