నీహారికా,
మంచి అలవాట్లు జీవన విధానం వంటి మాటలు చెపితే చాలు యువతరం చెవులు మూసుకుని పారి పోతారు. వాళ్ళకేదో ఉపదేశాలు చెప్పుతున్నాం అనుకుంటుంన్నారు. సంప్రదాయ భారతీయ జీవన విధాన రూపం శిల్పాలు ప్రజలకు ఎం చెప్పారంటే క్రమబద్దమైన జీవనం వల్లనే ఆరోగ్యంగా ఉండగలదన్నారు. వేకువజామున లేవడం సూర్య నమస్కారాలు పెట్టడం ప్రతి ఒక్కళ్ళకి అవసరం అన్నారు. వయస్సులో వుండగా పాటించిన అలవాట్లే పెద్దయ్యాక కవచంగా ఆరోగ్యాన్ని కాపాడి రక్షిస్తాయని హితవు చెప్పారు. కానీ మనం 60 శాతం నడకను వదిలివేశాం. సహజమైన గాలిని అనుభావించం ఎ.సి ల్లోనే అస్తమానం వుంటాం ఆర్ధిక పరమైన విశ్యాలల్లో జాగ్రత్తగా వుండటం పెద్దలు చెప్పిన మాటలు పాటించడం, ఆలోచనలు దగ్గరకే రానివ్వడం. వయస్సులో వుండగా ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకుంటే, జీవితంలో ఆర్ధిక అదుపును నేర్చుకుంటే జీవితమంతా బావుంటాం. అమరి తెలిసి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటామో అర్ధం కాదు. ఒక్క సై నియమ బద్దమైన జీవన విధానం గురించి ఆలోచించుకోవడం అవసరం ఏమో మరి ఆలోచించు.