ఏ విజయం అంతా తేలిగ్గా వరించదు. కష్టాల్లో రాటు దేలాలి.సాధించాలి,గెలవాలి.పింకి బల్హార్ మార్షల్ ఆర్ట్స్ లో ఆసియా క్రీడాల్లో రజతం సాధించింది.ఆమె ప్రయాణం ఏది సవ్యంగా సాగలేదు.పింకీ కుటుంబంలో మూడు నెలల్లో ముగ్గురు చనిపోయారు.అన్న ,నాన్న ,తాత. ఆమె ఆసియా క్రీడలకు ఎంపికైన కొద్దీ రోజులకే తండ్రి మరణించాడు. జూడో క్రీడకారిణిగా కెరీర్ మొదలు పెట్టిన పింకి కురుష్ ఈవెంటుకు మారింది.కఠోరా సాధనతో జాతీయ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటుకోని ఆసీయా క్రీడలకు ఎంపికైంది.ఈ క్రీడల్లో మార్షల్ ఆర్ట్స్ లో దేశానికి తొలి పతకం సాధించింది పింకీ బల్హారా.