సాధారణంగా వర్క్ వుట్స్ మొదలు పెట్టాక వెంటనే రిజల్ట్స్ రావాలనుకొంటారు. కానీ అది అసాధ్యం .వెంటవెంటనే మారిపోతూ ఉన్న రిజల్ట్ కనిపించదు. ఏదైనా ప్రభావం కనించాలంటే కానీసం ఒక సంవత్సం దానికి స్టిక్ అయి ఉండాలి. మార్పు కోసం వెరైటీ ఎంచుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు నిర్ధేశించుకోని అవి పూర్తయ్యే వరకు కట్టుబడి ఉండాలి. రోజు రోజుకీ ఎవరు బరువు తగ్గరు.ఆహారం, పోషకాల విషయంలో ప్రత్యేక శ్రధ్ద చూపించి ప్రతి నియమాన్ని కఠినంగా ఫాలో అవ్వాలి. ఓర్పు సహనం కావాలి. శరీరం ఒక మార్సుకు సిద్దపడేందుకు సమయం తీసుకొంటుంది. అప్పుడే సడన్ గా మానేస్తే చేసిన శ్రమ వృధా అవుతుంది.

Leave a comment