పెప్ లమ్ డిజైనర్ డ్రెస్ స్టైలిష్ లేటెస్ట్ అనుకోవాలి. ఇటు స్కర్ట్ లాగా పిటెడ్ జాకెట్ లాగా నడుము దగ్గర టైట్ చేసేలా వుండే పెప్ లమ్ ఫిట్టెడ్ జాకెట్స్ జీన్స్ ధోతీ ప్యాంట్ కు లూజ్ పటియాలా పైకి క్యాజువల్ కంఫర్ట్ లుక్ తో కనిపిస్తాయి. పెప్ లమ్ తో స్లిమ్ గా కనిపించాలంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. బాటమ్ గా పెన్సిల్ స్కర్ట్ ప్యాంటు ఎంచుకున్న లేటెస్ట్ స్టైల్ తో కనిపించచ్చు. దీనికి కాంట్రాస్ట్ గా వుండే ఆభరణాలు బావుంటాయి. రెడ్ కార్పెట్ వేదికలపైనా ప్రముఖ సినీ తారల స్టైలిష్ వెరైటీ గా మెరిసిన పెప్ లకు స్లిమ్ గా కనిపించాలనుకునే అమ్మాయిలకు సరైన డ్రెస్. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ని ఎంచుకుంటే సన్నగా కనిపిస్తారు. సంప్రదాయ వేడుకల్లో బరువైన మెరిసే లెహెంగా పైకి నెటెడ్ ఫ్యాబ్రిక్ తో చేసిన పెప్ లమ్ వేసుకుంటే ఇంకా ఆలుక్కే లేదు. ఓసారి చక్కని రంగు డిజైన్లు ఎంబ్రాయిడరీ వెరైటీలకు చూడండి.
Categories