Categories
కేరళ, తమిళనాడు లో ఎక్కువగా పెరిగే లవంగా చెట్టు నుంచి వచ్చే ఎండు మొగ్గలు లవంగాలు వీటిలో లవంగం నూనె తయ్యారు చేస్తారు. టూత్ పేస్టు ల్లో మౌత్ వాషర్లలో లవంగ నూనె అధికంగా వాడుతారు కారణం అందులోని ప్రత్యేకమైన యాంటీ బాక్టీరియర్ గుణాలే. వాతావరణ సంబందిత విషతుల్యాల నివారణలో లవంగా నూనె అమోఘంగా పనిచేస్తుంది. లవంగాలు రుచికోసం కూరల్లో వేసుకునే ఒక పోపు దినుసులా చూస్తామే కానీ వీటిలో విలువైన పోషకాలున్నాయి. ఈ నూనె దోమల్ని దగ్గరకు రానివ్వదు. లవంగాల్లోని యుజేనాల్ అనే రాసాయినానికి అద్భుతమైన ఔషధ పోషక విలువలున్నాయి.