మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలు ధైర్యంగా ప్రతిఘటించాలి అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిందే అంటారు తెలంగాణ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి జెడ్ పి టి సి సభ్యులు సంధ్యారాణి ఇతరులను ప్రోత్సహించే ముందర తానే స్వయంగా కర్రసాము కరాటే నేర్చుకున్నా రామె. రామగుండం లో జరిగిన ఒక పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంధ్యారాణి పోటీలో పాల్గొన్న వారితో కర్ర సాము చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడామె ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు బాలికలు ఆమె దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు.

Leave a comment