ఔషధపరంగా ఎంతో విలువైన పూదినా రోజువారిగా వంటల్లో విరివిరిగా ఉపయోగించుకొంటే చాలు, ఇటు ఆహారానికి రుచి ఆరోగ్యం రెండూ ఉంటాయి. ఔషధ గుణాలు ఎక్కువ కనుక దీన్ని చూయింగ్ గమ్, కందీలు ,టూత్ పేస్ట్ లు , పిప్పరమెంట్స్,స్పియర్ మింట్, వాటర్ మింట్ ఎన్నింటిలోనూ పూదీనా ఉంది. కర్జోరం ,బరెగానో ,లెవెందర్ వంటివి పూదినా కుటుంబానికి చెందినవి. టీ లో ఇతర వంటకాలలో ప్రపంచం మొత్తం వాడే పూదీనాలో పాలిపినాల్స్ ఉంటాయి. వీటిలో మెంథాల్ ఒకటి. పూదీనా వాసనకుఇదే కారణం ఇందులో యాంటీ క్యాన్సర్ ,యాందటీ బ్యాక్టిరీయల్ ,యాంటీ ఆక్సిడెంట్ ,యాంటీ ఇన్ ఫ్లమెటల్ గుణాలు ఉన్నాయి. ఉదరం చిన్న అసౌకర్యంగా ఉన్నా ఓ కప్పు పూదీనా టీ తాగితే చాలు అంతా సర్దుకుంటుంది.

Leave a comment