ఇండోర్ ప్లాంట్స్ నిజానికి ఎంతో ఖరీదైన ఇంటీరియర్స్ కంటే ఇంటికి అందం ఇస్తాయి. ఒక్కసారి అవి వడలిపోయి ఆకు చివర్ల ఎండినట్లుగా కనిపించి మనసు పాడైపోతుంది అలాంటప్పుడు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. పావు కప్పు పచ్చి పాలకు రెండింతలు నీళ్లు కలిపి మొక్క మొదట్లో పోయాలి. వారం పాటు ఇలా చేస్తే మళ్లీ మొక్క జీవం పుంజుకుంటుంది. ఆకులపై మచ్చలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తే బై కార్బోనేట్ ను ఓ స్పూన్ మొక్క మొదట్లో వేస్తే ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఆకులు కాలి పోయినట్లుగా ముడుచుకు  పోతూఉంటే మొక్కకు పోసే నీళ్ళలో కొద్దిగా ఈస్ట్ కలిపి పోస్తే మొక్క మళ్ళీ నవనవలాడుతుంది.

Leave a comment