జీవితం గొప్ప బాధ్యత. ఎన్నో బంధాలు బాంధవ్యాలు ఉంటాయి.ఎంతో జాగ్రత్తగా ఈ బంధాలను నిలబెట్టుకోవాలి భావోద్వేగాలు గుప్పెట్లో పెట్టుకోగలిగితేనే బాంధవ్యాలు పదిలంగా ఉంటాయి. భావోద్వేగాల పైన అదుపు ఉంటేనే తొందరపడకుండా ఆచి తూచి అడుగు వేయగలగుతారు.కీలక నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా విశ్లేషించుకోగలిగిన మానసిక స్థితి ఉంటుంది.కోపంతో తొందర పడితే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోని,తమని తాము సమీక్షించుకొంటారు కానీ ఇతరుల పై నిందలు వేయద్దు తమ తప్పులను అర్థం చేసుకొని ఇతరుల తప్పులు క్షమించగలుగుతారు, వాదనలు వాయిదా వేస్తారు విమర్శకులను నిందించరు. తన సొంత ఉద్దేశాలను కాకుండా ఎదుటివారి భావోద్వేగాలను గౌరవిస్తారు. ఇతరులను సరిగ్గా అంచనా వేయగలుగుతారు.ఇదంతా మనసుని నియంత్రించుకోవటం చాతనయితేనే సాధ్యం.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134