పాల్ అలెగ్జాండర్ రాసిన పుస్తకం త్రీ మినిట్స్ ఫర్ ఎ డాగ్ మై లైఫ్ ఇన్ యాన్ ఐరన్ లాంగ్ ,ఒక సంచలనం. 60 ఏళ్లుగా ఒక ఇనుప యంత్రం సాయంతో బతుకుతున్న పాల్ జీవిత కథ ఇది. అమెరికాలోని డల్లాస్ కు చెందిన అలెగ్జాండర్ కు ఇప్పుడు 72 ఏళ్లు. ఆరేళ్ల వయసులో సోకిన ఒక వింత పోలియో అతన్ని ఇలా ఒక ఇనుప చట్రం లో బిగించింది. 1916 నుంచి అమెరికాలో ప్రతి వేసవిలోనూ పిల్లలకు ఇలాంటి పోలియో వ్యాధి దాడి చేసేది .58 వేల కేసులు నమోదయ్యాయి 21 వేల మంది చిన్న పిల్లలు చనిపోయారు. పాల్ కీ సోకింది ఈ పోలియో. డాక్టర్ లు అతన్ని రెస్పిరేటరీ సిలిండర్ లో పడుకోబెట్టారు కొద్దికొద్దిగా గాలి పీల్చేలాగా శిక్షణ ఇచ్చారు. పాల్ పీల్చిన గాలి ఒక కొలిమి తిత్తి ద్వారా బయటకు పోతుంది .లోపల వేడిగా ఉక్కగా ఉంది 18 నెలలు ఆసుపత్రిలో గడిపాక తను పడుకొని ఉన్న సిలిండర్ తోనే ఇంటికి వచ్చేశాడు పాల్ .కరెంట్ పోతే ఫెడల్ నొక్కుతూ యంత్రం నడిచేలా చూసే వారట అతని అమ్మ నాన్న లు బతికినన్నాళ్లు ఇలా సిలిండర్ తోనే బతకాలని తేలిపోయాక పాల్ ఆ యంత్రాన్ని తను కొద్ది సేపు కూర్చో గలిగేలా మార్పులు చేసి, యంత్రం తోనే స్కూల్ కు వెళ్లి టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా తీసుకున్నాడు పాల్.పోలియో సోకినప్పుడు అతని వయసు ఏడేళ్లు .యంత్రం తోనే చదువుకొని కోర్టుకు వెళ్లి చర్చికి ,సముద్రపు ఒడ్డుకు వెళ్ళి ఉన్నంతలో సంతోషంగా గడిపాడు పాల్ .తన జీవితాన్ని నవలగా రాశాడు ఒక అడుగు పొడుగ్గా ఉన్న ప్లాస్టిక్ పుల్ల నోట్లో ఉంచుకొని దాని చివర ముడేసిన పెన్సిల్ తో లాప్ టాప్ కీబోర్డ్ తాకుతూ ఎనిమిదేళ్ల పాటు కష్టపడి తన జీవిత చరిత్ర రాశాడు పాల్ .అతని సంకల్ప బలం ముందు మనుషుల కష్టాలు ఏపాటివి చెప్పండి !
Categories