గుండె పరిపూర్ణమైన ఆరోగ్యంలో మనసు పాత్ర చాల కీలకం అంటారు వైద్యులు . ధ్యానం మనసు పైన నియంత్రణ ఇస్తుంది. ఆలోచనకు పగ్గాలు వేసే కిటుకు చెపుతోంది అలా ధ్యానం ప్రభావం శరీరం పైనే కాదు ,మనసు పైన అధికమని అధ్యయనాలు చెపుతున్నాయి . మనసు ఎప్పుడు వత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటేనే గుండెకు ఆరోగ్యం అందుకే వృత్తి సంబంధమైన వత్తిడిలు ఎన్నిఉన్న కుటుంబానికి కొత్త సమయం కేటాయించారు . విహారయాత్రలకు వెళ్ళాలి . అంతులేని లక్ష్యాల కింద నలిగి పోకుండా పరిమితులు ఉండాలి . చిత్రలేఖనం ,నాట్యం ,సంగీతం వంటి లలితకళలు గుండె ఆరోగ్యం పైన సానుకూలంగా ప్రభావం చుపిస్తాయంటున్నారు . మనసుకు హాయినిచ్చే వ్యాపకాలు కల్పించుకో మంటున్నారు వైద్యులు .

Leave a comment