” సునీతాకృష్టన్ వంటి మనిషి మన మధ్య ఉన్నందుకు మనమంతా ఆమెకు కృతజ్ఙతలు తెలియజేయాలి ” అంటూ అనుష్క శర్మ ట్విట్టర్ లో ప్రజ్వల హమ్ నడిపే సునీత గురించి కామెంట్ పెట్టారు అలాగే  కౌన్ బనేగా కరోడ్ పతి ఆమె పరిచయం చేసినందుకు అమితాబ్ బచ్చన్ కు ధన్యవాదాలు చెప్పారు . ఘోరమైన జీవిత వాస్తవాల మధ్య ఓ పోరాట యోధురాలు ,అని కూడా సునీతను ప్రశంశిస్తూ ట్వీట్ చేశారు అనుష్క శర్మ. సునీత పదిహేనేళ్ళ వయసులో అత్యాచారానికి గురై ,ఆ పీడకల నుంచి తనంత తాను బయటపడి ,అత్యాచార భాదితులకోసం ,మహిళల అక్రమ రవాణా నివారించటం కోసం 30 ఏళ్లుగా కృషి చేస్తోంది . 20 వేలమందికి పైగా భాదితులను కాపాడి వారికీ పునరావాసం కల్పించింది  సునీతాకృష్టన్ .

Leave a comment