Categories
కోవిడ్ బాధితులు హోం ఐసోలేషన్ లో గడుపుతూ ఉన్న స్థితిలో శ్వాస లో ఇబ్బందులు తలెత్తితే ప్రోనింగ్ నియంత్రించవచ్చని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచిస్తోంది. కోవిడ్ బాధితులను శ్వాసను మెరుగుపరచడం కోసం బోర్లా పడుకోబెట్టటమే ప్రోనింగ్. ఆక్సీజన్ తేలికగా ఊపిరి తిత్తులలో కి చేరుకునేందుకు శ్వాస మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని వైద్యపరమైన అనుమతి పొందిన బాడీ పొజిషన్ ఇది ఆక్సి మీటర్ లో ఆక్సిజన్ స్థాయి 94 అంతకంటే తక్కువ కు పడిపోయినప్పుడు బాధితులను ఆస్పత్రికి తరలించే లోపు ప్రోనింగ్ పొజిషన్ లో పడుకోబెట్టడం వల్ల ముంచుకొచ్చే ప్రమాదం తప్పుతుంది. ఎంత ఎక్కువ సమయం ప్రోనింగ్ పొజిషన్ లో ఉండగలిగితే అంత సమయం ఉండాలి.