Categories
చర్మ సౌందర్యం కోసం కాఫీ పొడి ఉపయోగించుకోవచ్చు అంటారు ఎక్స్ పర్ట్స్ . కాఫీలో ఉండే కెఫిన్ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో తోడ్పడుతోంది. కాఫీలో ఉండే నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ కళ్ళ కింద నల్లని వలయాలను తగ్గిస్తాయి. మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను చంపేందుకు కాఫీ సహాయపడుతుంది. కాఫీ మాస్క్ అప్లై చేస్తే ముడతలు మచ్చలు పోతాయి. కాఫీ పౌడర్ కోకో పౌడర్ ను ఒక బౌల్ లోకి తీసుకుని కొద్దిగా పాలు పోసి పేస్ట్ లా చేయాలి. రెండు చుక్కల తేనె నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసి అరగంట ఆగి శుభ్రం చేసుకోవాలి. అలాగే కాఫీ పొడి లో అలోవెరా జెల్ కలిపి ముఖం పై స్క్రబ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే సహజసిద్దమైన మెరుపును సంతరించుకుంటుంది.