Categories
కొత్తిమీరలో సౌందర్య గుణాలు ఎక్కునే ఉన్నాయి. ఈ కొత్తిమీర ఫేస్ మాస్క్ లాగా వేసుకుంటే ముఖం పైన గీతలు మాయమవుతాయి.పొడిబారిన పెదవులు తాజాగా మెరుస్తాయి.కొత్తిమీర పేస్ట్ లో ఓ టీ స్పూన్ కలబంద గుజ్జు వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని మొహానికి రాసుకుని ఒ పావుగంట తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకుంటే ఈ కొత్తిమీర లోని విటమిన్ ఎ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.ముడతలు రానివ్వదు.దీనిలోనే ఫ్రీరాడికల్స్ విటమిన్ సి చర్మం పైన మలినాలను తొలగిస్తాయి.కొత్తిమీర లోనీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ సెప్టిక్ గుణాలు చర్మానికి స్వాంతన ఇస్తాయి.అలాగే ముల్తానీ మట్టి,టమోటాల గుజ్జు,కొత్తిమీర పేస్ట్ నిమ్మరసం కలిపి మాస్క్ వేసుకొన్న చర్మం కాంతివంతంగా మెరుస్తుంది .