పెదవులకు లిప్ స్టిక్ అందమే కానీ వాటిలోని వాక్స్ రంగులు హాని చేస్తాయన్నది మాత్రం నిజం. అందుకే మరీ అవసరం అయితే తప్ప లిప్ స్టిక్ జోలికి పోకుండా ,ఎన్నో రంగుల లిప్ గ్లాస్ లు అందుబాటులో ఉన్నాయి కనుక వాటిని వాడుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్.సీజన్ తో సంబందం లేకుండా పెదవులు పగిలి నల్లగా అయిపపోతూ ఉంటాయి. మృత కణాలు పేరుకొని పోవటంమే అందుకు కారణం.టూత్ బ్రెష్ ని పంచదారలో ముంచి పెదవులపై నెమ్మదిగా రుద్దితే మృత కణాలు రాలిపోతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే పెదవులు మృదువుగా అయిపోతాయి.శరీరానికి సరిగ్గా నీళ్ళు అందకపోయినా పెదవులు ఎండి పోతాయి. ఈ వేసవి ఎండలకు నీళ్ళు ఎక్కువగా తాగితే సమస్యకొంత వరకు తగ్గుతోంది. రసాయనాలు లేని నాణ్యమైన లిప్ బాప్ ఎంచుకోంటే పెదవులు తేమగా ఉంటాయి.
Categories