Categories

ఈ చలి రోజుల్లో పెదవులు తడి ఆరిపోయి పగిలి పోతాయి. పెదవులు తడిపితే పగుళ్ళు కనబడకుండాపోతాయి అనుకొంటారు. కానీ ఇలా తడిపినా,ఆ పగుళ్ళ పైనే లిప్ బామ్,లిప్ స్టిక్ వేసిన పెదవులు సున్నితత్వాన్ని మెరుపును పోగొట్టుకుంటాయి. అలాటిప్పుడు నల్లబడిన పెదవులకు ఆపిల్ సిడార్ వెనిగర్ అద్భుతంగా పని చేస్తుంది. టీ స్పూన్ వెనిగర్ లో టీ స్పూన్ నూనె కలిపి దాన్ని దూదితో పెదవులకు పట్టించి పదినిముషాలు తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగితే మంచిది. ఆపిల్ సిడార్ వెనిగర్ లో వుండే అల్ఫాహైడ్రాక్స్ ఆమ్ల లకు పిగ్మెంటేషన్ తగ్గించే లక్షణం ఉంటుంది.