Categories
ఇప్పటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్క బిడ్డ ఉంటే చాలు అనుకుంటున్నారు తల్లిదండ్రులు. అలా ఒక్కరే ఉన్నా ఇంట్లో పిల్లలు వంటరితనం ఫీలవకుండా దగ్గర లో వారి కజిన్స్ ఉంటే వాళ్లకు అనుబంధం ఏర్పడేలా చూడాలి. అలాగే బంధుత్వానికి మించిన బలం స్నేహానికి ఉంది. స్నేహితులు ఉంటే ఒంటరి భావన పిల్లల్లో కలగదు. ఇంటికి పరిమితం చేసే కొద్ది ఒంటరితనం పెరుగుతుంది. పుట్టిన రోజులు, పండుగ రోజులు ఒకే ఈడు పిల్లలు ఒకే చోట కలిసేలా చూడాలి. ఇచ్చి పుచ్చుకోవడం అలవాటు చేస్తే తోబుట్టువులు లేని లోటు తోటి పిల్లలే తీర్చేస్తారు.