ఫార్చూన్ ఇండియా శక్తి మంతమైన పారిశ్రామిక వేత్తల(2017)జాబితాలో 46వ స్థానం దక్కించుకొంది అమీరా షా. ప్రస్తుతం మెట్రో పాలిటిన్ హెల్త్ కేర్ సంస్థ ప్రమోటర్ డైరక్టర్ గా ఉన్నారు. ముంబైలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం మాది. మా నాన్న సునీల్ షా 2000 సంవత్సరంలో మెట్రోపాలిటిన్ హెల్త్ కేర్ స్థాపించారు. నేను అమెరికాలోని ఆస్టిన్ లో యూనివర్సీటీ ఆఫ్ టెక్సాస్ లో ఫైనాస్స్ డిగ్రీ చేసి తిరిగి వచ్చాక వ్యాపారంలో భాగాస్వామి అయ్యాను. ఈ రంగంలో మరింత నైపుణ్యం కోసం హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో ఓవర్ ప్రెసిడెంట్ మేనెజ్ మెంట్ ప్రోగ్రామ్‌ చేశాను. మా సంస్థ ముంబైకే పరిమితం ఒకప్పుడ,కానీ ఇప్పుడు లిమిటెడ్ కంపెనీ . ఇందులో పనిచేసే ఉద్యోగులు నేనూ అందరం కలిసి చేసిన కృషి ఫలితం నా కంపెనీ మంచి స్థాయిలో ఉండటం అంటోంది అమీరా షా.. ఫోర్భ్స్ లో శక్తిమంతమైన మహిళ పారిశ్రమిక వేత్తగా స్థానం సంపాదించింది అమీరా షా.

Leave a comment